
స్టార్ హీరో భార్య ఐశ్వర్య రాయ్ ఇలా ఈ విమర్శలు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.. ఇలా ఆమె మరణవార్త విన్న ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంగీత ప్రియులు, రాజకీయ నాయకులు సైతం ఈమె మరణంపై నివాళులు అర్పించడం జరిగింది. ఇక కొంతమంది అయితే ఆమె పార్థివదేహాన్ని దగ్గరికి వచ్చి నివాళులు అర్పించారు.. ఇక ఈమె పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇక అలాగే బాలీవుడ్ లో చెందిన కొంతమంది నటీనటులు రన్బీర్ కపూర్ షారుక్ ఖాన్ అమితాబ్ బచ్చన్ వంటి వారు వచ్చి ఆమె పార్థివ దేహాన్ని సందర్శించారు.. ఇక ఆ తర్వాత సంతాపం తెలియజేయడం జరిగింది.
ఇక కొంతమంది అభిమానులు, సినీ ప్రముఖులు సైతం తమ సోషల్ మీడియా ద్వారా ఆమె మృతి పట్ల సానుభూతి చేయడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే అమితాబ్ బచ్చన్ కోడలైన ఐశ్వర్యారాయ్ ఎంతో ఆలస్యంగా ఈమె మృతి పట్ల స్పందించడం జరిగింది.. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ లతా మంగేష్కర్ మమ్మల్ని విడిచి వెళ్లడం చాలా దురదృష్టకరమని ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈమె చాలా లేటుగా స్పందించిందని నెటిజన్లు ఐశ్వర్య రాయ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాన కోకిల గా ఎంతో పేరు సంపాదించిన లతా మంగేష్కర్ గారి పట్ల మీకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.