సినీ పరిశ్రమలో మరొక తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ లెజెండరీ గాయని అయిన సంధ్య ముఖర్జీ మరణవార్త సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈమె వయస్సు 90 సంవత్సరాలు. గత కొన్ని నెలల నుంచి ఈమెకు గుండె సంబంధిత సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.. అయితే నిన్నటి రోజున ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలియజేశారట. గత నెలలో ఈమె కోవిడ్ స్వల్ప లక్షణాలు రావడంతో ఈమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారట కుటుంబ సభ్యులు.

 సంధ్య ముఖర్జీ బెంగాలీ, హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడిందట సంధ్య ముఖర్జీ. ఇక ఇలాంటి గాయని మరణించడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో పాటు, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా ఈమె మరణం పై సంతాపం తెలియజేయడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డులను కూడా సంధ్య ముఖర్జీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 90 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక వ్యక్తికి ఇలాంటి పద్మశ్రీ ఇవ్వడం అవమానకరమని ఆమె వాటిని తిరిగి చేసిందని తన కూతురు సౌమి సేన్ గుప్త తెలియజేసింది.


సంధ్య ముఖర్జీ 2011వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అందించిన పౌర పురస్కారమైన బంగాబి విభూషణ్ అవార్డును అందుకున్నది.ఇక హాలీవుడ్ లో కూడా మ్యూజిక్ పరంగా పేరు సంపాదించిన జై జయంతి మూవీ కోసం 1970వ సంవత్సరంలో ఉత్తమ మహిళ గాయనిగా పేరు పొందింది.ఇక పలు అవార్డులను కూడా అందుకున్న ది. 1960-70 సంవత్సరంలో ప్లేబ్యాక్ సింగర్ గా ఎన్నో పాటలను అందించింది ఈమె. బెంగాలీ లోని కొన్ని వేలాది పాటలను కూడా పడిందట. ఈమె మొత్తంగా 12 భాషలలో పాటలు పాడి అభిమానులను బాగా అలరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ కాస్త దిగ్భ్రాంతి చెందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: