తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు గారి సినిమాల్లోని హీరోయిన్స్ ని బాపు బొమ్మలుగా అందరూ కూడా అభివర్ణించేవారు. బాపు గారి సినిమాల్లో నటిస్తే చాలు అందం అభినయం ఉన్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో వారు వెలుగొందెవారు.

అలాగే కె రాఘవేంద్ర రావు కూడా మరే డైరెక్టర్స్ కూడా చూపెట్టనంత అందంగా హీరోయిన్స్ ని తెరపై కవితాత్మకంగా చూపెట్టడంలో ఈ ఇద్దరు కూడా దిట్ట. టాలీవుడ్ లో వీళిద్దరి తరువాత హీరోయిన్స్ ని చూపెట్టడంలో రామ్ గోపాల్ వర్మ కచ్చితంగా ఉంటాడు. అప్పటి ఊర్మిళ నుండి ఇప్పటి అప్సర రాణి వరకు కూడా తెలుగు తెరకి ఆయన అందాలని పరిచయం చేస్తూనే ఉన్నాడు. అయితే సినిమాల్లోనే కాకుండా బుల్లితెరలోను వర్మ బ్రాండ్ ఉన్న అమ్మాయిలు ఉంటారు. అలాంటి వారిలో యాంకర్ అరియానా మరియు శ్రీరాపాకల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వర్మతో ఈ బ్యూటీస్ రిలేషన్ ప్రత్యేకమని ఇండస్ట్రీ లో రూమర్స్. అలాంటి ఈ ఇద్దరు వర్మ బ్యూటీస్ ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు.

 తాజాగా బిగ్ బాస్ షో ఓటీటీ ట్రాక్‌ కూడా ఎక్కింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌గా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. ప్రతిరోజు చాలెంజర్స్‌ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లో నిద్రపోయే అవకాశం లభిస్తుందని ఒక మెలిక కూడా పెట్టారు. చాలెంజర్స్‌ భోజనం చేసిన తర్వాతే వారియర్స్‌ ఒకేచోట కలిసి ఒకేసారి తినాలని నిబంధన కూడా పెట్టారు. వారియర్స్‌ సభ్యులు ఎవరే పని చేయాలో నిర్ణయించేందుకు చాలెంజర్స్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా కూడా జరిగింది. ఈ క్రమంలో శ్రీరాపాకకు మరియు అరియానాకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంటర్వ్యూలో ఓవరాక్టింగ్‌ వద్దని శ్రీరాపాక అనడంతో భగ్గున లేచిందట అరియానా. స్టేట్‌మెంట్స్‌ ఇవ్వద్దు, నా స్టైల్‌ ఇలానే ఉంటుంది అని కౌంటరిచ్చిందట బోల్డ్‌ బ్యూటీ. ఇక హౌస్‌లో నామినేషన్ల పర్వం కూడా మొదలైందట. మరి ఎవరెవరు ఎవరెవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్‌ స్ట్రీమింగ్‌ చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: