టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ లేటెస్ట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శర్వా సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

చిరు (శర్వానంద్) ఎన్ని పెళ్లిచూపులు చూసినా తనకు అమ్మాయి నచ్చక కొన్ని. అమ్మాయి తనకు నచ్చినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నచ్చక మరికొన్ని ఇలా పెళ్లిచూపులు చూస్తూనే ఉంటాడు. అమ్మాయి చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న చిరు ఆశల మీద ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఈ క్రమంలో చిరు ఒకసారి ఆద్య (రష్మిక)ని చూసి ఇష్టపడతాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆద్య మదర్ వకుల్ (ఖుష్బు)కి పెళ్లంటే అసలు పడదు. అలాంటి ఆమెని మెప్పించి పెళ్లికి ఒప్పించాలని చిరు చేసిన ప్రయత్నమే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా.

విశ్లేషణ :

శర్వానంద్ నుండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా. సినిమాలో అతని కామెడీ, నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా ఎమోషనల్ గా నడిపించాడు. అయితే ఆ ఎమోషనల్ సీన్స్ కొద్దిగా బోర్ కొడతాయి.

కిశోర్ తిరుమల చెప్పాలనుకున్న విషయాన్ని బాగా చెప్పగలిగాడు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ మళ్లీ అలరించేలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కూర్చుని సరదాగా చూసే సినిమాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఉంటుంది. సినిమాలో ఎక్కడ ట్రాక్ తప్పకుండా అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కిశోర్ తిరుమల బాగా తీశాడు.

నేను శైలజతో హిట్ అందుకున్న కిశోర్ ఎప్పటిలానే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కథాంశంతో సినిమా చేశాడు. అయితే ఈసారి కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాలో అక్కడక్కడ డ్రామా తప్ప సినిమా అంతా బాగానే ఉందనిపిస్తుంది. అయితే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి.. మాస్ ఎలిమెంట్స్ ఆశించే ఆడియెన్స్ కి ఈ ఫ్యామిలీ మూవీ నచ్చే ఛాన్స్ లేదు.

నటీనటుల ప్రతిభ :

శర్వానంద్ చిరు పాత్రలో తన బెస్ట్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ లో అతను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రష్మిక మందన్న మరోసారి తన టాలెంట్ చూపించింది. సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలనాటి తారలు రాధిక, ఖుష్బు, ఊర్వశిలు కూడా పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. సినిమా అంతా చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. మిగతా పాత్రదారులంతా కూడా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సుజిత్ సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో హీరోయిన్స్ ని బాగా చూపించారు. స్క్రీన్ అంతా చాలా కలర్ ఫుల్ గా ఉండేలా చూశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. కెరియర్ లో ఫస్ట్ టైం శర్వానంద్, దేవి శ్రీ ప్రసాద్ కలిసి పనిచేశారు. డైరక్టర్ కిశోర్ తిరుమల ఎప్పటిలానే ఎమోషనల్ కథతో వచ్చారు. అయితే ఈసారి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథతో మెప్పించారు. సెకండ్ హాఫ్ కొద్దిగా జాగ్రత్త పడితే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

శర్వానంద్ టైమింగ్

రష్మిక గ్లామర్

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఒకసారి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: