
ఇక ఈ షోలో కి పలువురు సినీ సెలబ్రిటీలను గెస్ట్లుగా పిలిచి వారిని ఆసక్తికర ప్రశ్నలు అడగడం.. అంతకు మించిన ఆసక్తికర సమాధానాలను వారి నుంచి రాబట్టడం చేస్తూ ఉంది. కాగా ఈ క్రమంలోనే ఈ షో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సాధించింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే కంగానా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ రియాలిటీ షోలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే వచ్చింది. ఈ సందర్భంగా ఊహించని రీతిలో హాట్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ముఖ్యంగా తన బోల్డ్ వీడియోలు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
నా వీడియోలు కి లక్షల వ్యూస్ వస్తున్నాయి.. అంటే రాత్రి సమయంలో వాటిని చూసి ఎంజాయ్ చేసిన వారు.. ఇక పగలు నాపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది మహిళలు అయితే గ్రూప్ గా ఏర్పడి నా పై అనవసరమైన అవాస్తవమైన పుకార్లు సృష్టిస్తున్నారు. నేను బోల్డ్ షో చేసినంత మాత్రాన సిగ్గులేని దాని అవుతానా.. ఇతరులను ఇబ్బందులకు గురి చేసిన వారే నిజంగా సిగ్గు లేని వాళ్లు అవుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్ పాండే. ఇక ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఈ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఉండటం గమనార్హం.