
దాంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇంతకీ ఫస్ట్ రివ్యూ ఇచ్చింది ఎవరు... అసలు నిజానికి మూవీ ఎలా ఉంది అంటే ? తాజాగా ఈ మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెన్సార్ సభ్యులు యూ / ఏ సర్టిపికెట్ ఇవ్వడం జరిగింది. కాగా ఈ సినిమా లో విజువల్స్ మునుపెన్నడూ లేని తరహాలో ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని, రెండున్నర గంటల పాటు ఆశ్చర్యంతో అలరిస్తాయి అని చెబుతున్నారు. ఇక సెన్సార్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా చూసిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు. ఈ చిత్రం అద్భుతం, అద్వితీయం అంటూ ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వెల్లడిస్తూ పోస్ట్ చేశారు.
అన్ని హంగులు సంపూర్ణంగా దిద్దిన అందమైన చిత్రం రాధేశ్యామ్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అసలు ఎవరు ఉహించలేనిది, మరుపురానిది అలా క్లైమాక్స్ చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు తీయని సరికొత్త మిస్టరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడి యొక్క మనసును గెలుచుకుంటుంది అన్న నమ్మకం కలిగింది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఉమైర్ సందు గతంలో కూడా చాలా చిత్రాలకు రివ్యూ లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ లుగా మిగిలిపోయాయి. కాబట్టి ఈ సినిమా చరిత్ర ఎలా ఉండనుందో తెలియాలంటే 11 వరకు ఆగాల్సిందే.