బాలీవుడ్ హాట్ బ్యూటీ శృంగార తార అయిన పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కూడా వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన భర్తతో ఎప్పుడూ గొడవ పడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇక ఈమె నుంచి రోజుకో వివాదాస్పద వార్త అనేది బయటికి వస్తుంది. వ్యాపారవేత్త శ్యామ్ బాంబే ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ కేవలం నెలరోజులు కూడా గడవకముందే తన భర్తపై అత్యాచార కేసు పెట్టి మరి అతడిని జైలుకు పంపింది పూనమ్ పాండే.ఎప్పుడూ వివాదాలతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో లో కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ షో లో అమ్మడు తన కాపురంలో తాను పడిన బాధలను ఇంకా అలాగే కష్టాలను ఏకరువు పెట్టింది. మొన్నటికి మొన్న భర్త తనను ఎంత హింసించాడో చెప్పి ఎమోషనల్ అయిన పూనమ్ పాండే మరోసారి ఆ నరకాన్ని గుర్తుచేసుకోని బాధ పడింది.


” ఇక ఈ లాకప్ షో లో నాకు అన్ని కూడా దొరుకుతున్నాయి.. మంచి ఫుడ్, బెడ్ ఇంకా నిద్ర.. శ్యామ్ తో కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు నాకు పెద్ద నరకంలా అనిపించేది. నాలుగేళ్లు సరిగ్గా కూడా తిన్నది లేదు.. కంటి నిండా సరిగ్గా నిద్ర కూడా లేదు.. రోజు తిట్టడం ఇంకా కుక్కను కొట్టినట్లు కొట్టడం అలాగే ఒక రూమ్ లో బంధించడం.. రోజూ ఇదే జరుగుతూ ఉండేది.కనీసం తినడానికి నాకు వడాపావ్ అయినా దొరికితే చాలు అనుకునేదాన్ని.. ఇక ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలంటే ఫోన్ అసలు నా చేతిలో ఉంచేవాడు కాదు.. ఇది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి..ఇక ఈ నరకాన్ని భరించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించాను” అంటూ పూనమ్ కన్నీటి పర్యంతమయ్యింది. మరి ఈసారి అమ్మడి కామెంట్స్ కి తన మాజీ భర్త శ్యామ్ బాంబే ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: