సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇక ఇటీవల ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా కూడా భారీ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ వెబ్ సిరీస్ లో రాజీ అనే రెబెల్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ లోనూ సమంతకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నలిచ్చింది సమంత.

స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన చర్చల కోసం ముంబై అంధేరీలోని రాజ్ అండ్ డీకే నివాసంలో సమావేశం జరిగింది. ఇక దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్ సమంత,వరుణ్ ధవన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం అయిపోయిన తర్వాత సమంత బయటికి వెళ్లిపోతున్న సందర్భంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు అంతా ఆమె చుట్టుముట్టారు. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

దీంతో సమంత ఒక్కసారిగా భయపడిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వరుణ్ధావన్ సమంతకు రక్షణగా నిలబడ్డాడు. అభిమానులను జర్నలిస్టులను సముదాయించాడు. జరగండి.. ఎందుకు భయపెడుతున్నారు.. భయపెట్టకండి ఆమెను.. అంటూ రిక్వెస్ట్ చేసాడు. ఆ తర్వాత సమంత ను సేఫ్ గా కార్ వరకు తీసుకెళ్లాడు వరుణ్ ధావన్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వీడియో చూసిన నెటిజన్లు సమంతకు బాడీగార్డుల మారినా ఈ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుణ్ ధావన్ రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో గా బిహేవ్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఒక్క వీడియో తో వరుణ్ ధావన్ ఫ్యాన్స్ మరియు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాడనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: