
వరుసగా వివాదాలు విమర్శలతో సాగిపోతున్న ఈ షో MX PLAYER లో ప్రసారం అవుతూనే ఉంది. ఇక ఈ షో పై ఎన్నో విమర్శలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. ఇక ఈ షోలో పూనమ్ పాండే కూడా పాల్గొనడం జరిగింది. తన గతాన్ని కూడా గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యింది. పూనమ్ పాండే గతంలో తన ఫ్యామిలీతో కలిసి నివసించేదట. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన కుటుంబం నుంచి ఆమెను గెంటేశారు అని తెలియజేసింది.
అయితే తను ఎప్పుడూ తన కుటుంబం గురించి కానీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని అయినా కూడా తన కుటుంబం తనకు దూరంగా పెట్టిందని.. ఈ విషయం తనకు ఇంకా అర్థం కాలేదని తెలియజేస్తోంది. కేవలం తన పనిలో తాను బిజీగా ఉన్నానని.. తన గురించి చాలా చెడుగా భావించారని కన్నీరు పెట్టుకుంది పూనమ్ పాండే. తన గురించి చెడుగా మాట్లాడేటప్పుడు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ ఆమె తెలియజేసింది. ఒక గత కొద్ది రోజుల క్రిందట శ్యామ్ బాంబే అనే వ్యక్తి తో రెండు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నది. ఇక ఈ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత.. తన భర్త పూనమ్ పై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగిందట. ఇక దీంతో అతనిపై గృహహింస కేసు కూడా పెట్టిందట.