మాస్ మహరాజ హీరో రవి తేజ ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు..ఆయన హిట్ సినిమాలతో పని లేకుండా వచ్చిన అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు. క్రాక్ సినిమా తో హిట్ ట్రాక్ లోకి  వచ్చిన మన హీరో, మళ్ళీ ఖిలాడీ సినిమా తో భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు.అది ఎ మాత్రం పట్టించుకోలేదు.. చేతిలో ఉన్న సినిమాలను చేసుకుంటూ పోతూన్నాడు.. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలలొ ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు.. ఒక సినిమా పూర్తీ కాక ముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు.. అవి అన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం..



పాన్ ఇండియా అంతకాకున్నా కూడా జనాలకు సినిమాను మరింత దగ్గర చేయడానికి భారీ వ్యయం తో సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి హీరోలు.అందుకోసం ఖరీదైన సెట్లు కొలువు తీరుతున్నాయి.. ఇది ఇలా ఉండగా రవి తేజ సినిమాలు కూడా మంచి డిమాండ్ తో రానున్నాయని తెలుస్తుంది. విషయాన్నికొస్తే.. టైగర్‌ నాగేశ్వరరావు' కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు నిర్మాతలు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తో దైర్యంగా మరో  అడుగును ముందుకు వేశారు.



రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ సినిమా కోసం హైదరాబాద్లో రూ.7 కోట్ల వ్యయంతో ఓ భారీ సెట్ వేశారు. శంషాబాద్ సమీపంలో ఈ సినిమాలో ని పత్ర్యెక సెట్ ను ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, స్టువర్ట్పురం సెట్ని కళా దర్శకుడు అవినాష్ తెరకెక్కిస్తున్నాడు. స్టువర్ట్పురం దొంగ పాత్రలో రవి తేజ కనిపించనున్నారు..అందుకే ఆ సెట్ ను వేసినట్లు తెలుస్తుంది. 1970 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్‌ నిర్మాణం జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: