అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి తన నటనతో, తన అందచందాలతో, తన హావభావాలతో ఎంతో మంది అభిమానుల మనస్సు ను గెలుచుకుంది.  ఇలా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది.  ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం యశోద సినిమా సినిమాలో నటిస్తుంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ,  విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా లో హీరోయిన్ గా నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కశ్మీర్‌ లో జరగనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం సమంత తాజాగా కాశ్మీర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత ఈ సినిమాతో పాటు ఉ ఒక హాలీవుడ్ సినిమాకు నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

అలాగే పలు బాలీవుడ్ సినిమా ల్లో కూడా నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ,  సమంత కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ ఇది వరకు నిన్ను కోరి , మజిలీ వంటి బ్లాక్ బస్టర్ ప్రేమ కథా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. శివ నిర్వాణ తాజాగా దర్శకత్వం వహించిన టక్  జగదీష్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈసినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో విడుదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: