సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు లేదా సహనటుల మధ్య ప్రేమ పుకార్లు రావడం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని సార్లు మీడియా వారికి వారే పని గట్టుకుని వారి మధ్య ఏమీ లేకపోయినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ రాస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఇవి నిజం అవుతుంటాయి... మరి కొన్ని సార్లు ఈ వార్తలను సదరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఖండిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య క్రికెటర్ లు కూడా సినిమా ఇండస్ట్రీల హీరోయిన్ లు లేదా వారి పిల్లలతో ప్రేమలో పడుతున్నారు. కొద్ది కాలంగా ఇండియన్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ బాలీవుడ్ స్టార్ హీరో అయిన సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి తో ప్రేమలో ఉన్నాడు అన్న వార్తలు గుప్పుమన్నాయి.

అయితే ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి మధ్య ప్రేమ ఉందని కన్ఫర్మ్ అయింది. కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ డేటింగ్ వరకు వెళ్లిందట... అయితే ఈ విషయం ఇరు కుటుంబాలలో తెలిసి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పెట్టలు ఎక్కనున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో రాహుల్ కి ఒక షాకింగ్ న్యూస్ సునీల్ శెట్టి ఫ్యామిలీ నుండి వచ్చింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి వీరిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలు కేవలము పుకార్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

దీనితో రాహుల్ అభిమానులు ఆశకు కళ్లెం వేసినట్లు అయింది. కాగా ప్రస్తుతం రాహుల్ ఐపిఎల్ సీజన్ 15 లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మొదటి సారి ఐపిఎల్ పాల్గొన్న ఈ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. మరి రాహుల్ నేతృత్వంలోని లక్నో ఐపిఎల్ టైటిల్ సాధిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: