
గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలు అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలను వసూలు చేశాయి. అయితే ఈసారి స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ ను అంతకు మించి వసూలు చేస్తాయని అందరూ ఆశ పడ్డారు. కానీ స్పైడర్ మ్యాన్ చైనాలో విడుదల చేయడానికి కొన్ని ఏర్పాట్లు జరిగాయి కానీ అక్కడ సెన్సార్ బోర్డు ముందుకు సినిమా తీసుకు వెళ్లగా క్లియరెన్స్ చేయలేదట. అందుకు కారణం ఏమిటంటే USA లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ని చూపిస్తూ ఒక సన్నివేశము ఉంటుంది. అలాంటి స్వేచ్ఛా పూరితమైన సన్నివేశాలు చైనా సినిమాలలో ఉండకూడదట.
చైనా ప్రాంతం మొత్తం పూర్తి కమ్యూనిస్ట్ పరిపాలనలో జరుగుతోంది. కనుక అక్కడి చిత్రాలు విషయంలో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. అక్కడి ప్రజలను వ్యతిరేకించి భావాలను కలిగిన ఈ చిత్రం కూడా అక్కడ విడుదల చేసేందుకు ఆ ప్రాంతం వారు ఒప్పుకోరు. అలాంటి దేశంలో స్పైడర్ మ్యాన్ న్యూ సీజన్ విడుదల చేసేందుకు ఒప్పుకోకపోవడంతో భారీ నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సన్నివేశం తీసేస్తే చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ చేసిందట. కానీ ఆ నిర్మాతలు మాత్రం ఆ సన్నివేశాన్ని తీసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.