ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన 5 ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

దంగల్ : అమీర్ ఖాన్ హీరోగా  నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2077 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.  ఈ మూవీ లో సాక్షి తన్వర్ , ఫాతిమా సన షైక్ , జైరా వసీం , సన్యా మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా , ఈ సినిమాకు ప్రీతం సంగీతాన్ని సమకూర్చాడు.


బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ  ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1130 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

 
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1110 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.

 
బజరంగీ భాయిజాన్ : సల్మాన్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భజరంగీ భాయిజాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 922 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: