తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ పేరు వినగానే ఎంతో మందికి నవ్వొస్తుంది. దయచేసి స్పూఫ్ లను తలచుకుని అవుతూ ఉంటారు. సహజంగానే సంపూర్ణేష్ బాబు దగ్గర సమయస్ఫూర్తి బాగా కనిపిస్తుంది ఆయన స్టేజి పైన మాట్లాడేటప్పుడు అది మనకి కనిపిస్తుంది. అలాంటి సంపూర్ణేష్ బాబు తాజాగా ఓ ప్రముఖ ఇలా అనేక విషయాలను వెల్లడించారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.



తను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుందంటే తనకి ఆశ్చర్యంగా ఉందని తెలియజేశాడు. కాలం కేవలం కొవ్వొత్తిలా కరిగి పోతుంది అంటూ తెలియజేశాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదని కానీ తన జర్నీ ఇప్పుడు చూసుకుంటూ తనకు ఆశ్చర్యం కలుగుతుంది అని తెలిపారు. వెండితెరపై కాసేపు కనిపిస్తే చాలు అనుకొని ఇండస్ట్రీ లోకి వచ్చాను ప్రస్తుతం ఆ కోరిక నాకు నెరవేరిందని దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నానని తెలియజేశారు. తను కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ వచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధమేనని తెలియజేశారు. కొబ్బరి మట్ట చిత్రం తర్వాత హీరోగా ఆరు సినిమాలకు ఒప్పుకున్నానని తెలియజేశాడు.


ఈ చిత్రాలను పూర్తి చేయడం పైన తన ఫోకస్ పెట్టానని అందుచేతనే వేరే సినిమాలలో అవకాశాల వచ్చిన ఒప్పుకోలేదని తెలిపారు. ఇక మీదట ఇతర హీరోల సినిమాలను సపోర్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన తనను గురువుగా భావిస్తారు అని తెలియజేశారు సంపూర్ణేష్ బాబు. పూరి జగన్నాథ్ లోఫర్ సినిమా కోసం అడిగారు. కానీ నేను అప్పుడు కొబ్బరిమట్ట షూటింగ్ లో ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను అని తెలియజేశారు. పూరి జగన్నాథ్ ఎంత గొప్ప డైరెక్టర్ అయినందువల్ల నేను ఎక్కడ కనిపించినా అతను ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: