
ఇక ఇందులో వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగోధ్వేవేగమయ్యేలా చేస్తోంది. దీంతో సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎగబడుతున్నరు. 1990వ సంవత్సరంలో సరళ అనే అమ్మాయి తన నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు వేణుఉడుగుల . ఇక ఈ సినిమాని డి.సురేష్ బాబు సమర్పణలో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ప్రస్తుతం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ నే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకోవడం జరుగుతోంది తాజాగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా ఈ చిత్రం కదిలించింది. తాజాగా విరాటపర్వం సినిమా చూసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ సినిమా చిత్ర బృందం మెచ్చు కోవడం జరిగింది. మస్ట్ వాచ్ ఫిలిమ్ అంటూ ఒక్క మాట లో రివ్యూ ని ఇచ్చారు. ఇక సాయి పల్లవి అద్భుతంగా నటించింది డైరెక్టర్ వేణు ను మెచ్చుకోవడం జరిగింది రాఘవేంద్రరావు. దీంతో ఈ సినిమా ఒక మెట్టు పై స్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు.