రామ్‌ చరణ్‌కి 'ఆర్ ఆర్ ఆర్'తో నార్త్‌లో భారీ స్టార్డమ్‌ వచ్చింది. అయితే బాలీవుడ్‌ మార్కెట్‌తో పోల్చితే, కోలీవుడ్‌లో ఇంకా స్ట్రాంగ్‌ బేస్‌ రాలేదని చెప్తుంటారు. ఈ గ్యాప్‌ని ఫిల్‌ చేయడానికి మార్కెట్‌ మరింత పెరుగుతుంది. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తోన్న సినిమాతో తమిళ ఆడియన్స్‌కి ఫాస్ట్‌గా రీచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది.

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్‌కి కోలీవుడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా తర్వాత తమిళ హిట్ 'తడమ్'ని 'రెడ్'గా రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు తమిళ డైరెక్టర్ లింగుసామితో 'ది వారియర్' అనే బైలింగ్వల్ మూవీ చేశాడు. జులై 14న ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది.

నాగచైతన్య 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఆమిర్‌ ఖాన్‌ స్టార్డమ్‌తో గుర్తింపు వస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఇక ఇదే జోష్‌లో తమిళ్ మార్కెట్‌కి వెళ్తున్నాడు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేశాడు నాగచైతన్య.

రజనీకాంత్, కమల్ హాసన్‌ స్లో అయ్యాక కోలీవుడ్‌ స్టార్లు చాలామంది ఆ వ్యాక్యూమ్‌ని వాడుకోవడానికి ప్రయత్నించారు. ఒకటి రెండు హిట్స్‌ రాగానే రెమ్యూనరేషన్లు పెంచుకున్నారు. అయితే మార్కెట్‌ మాత్రం పెంచుకోలేదు. దీంతో నిర్మాతలకి లాభాల్లో కోతలు పడుతున్నాయి. ఆ కటింగ్స్‌ని తగ్గించడానికి బైలింగ్వల్స్‌, మల్టీలింగ్వల్స్‌ చేస్తున్నారు తమిళ స్టార్లు.

'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్నాడు అనుదీప్. ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో అందరినీ డామినేట్‌ చేసి యాక్టింగ్‌లోకి వస్తాడా అనే డౌట్స్‌ క్రియేట్‌ చేసిన అనుదీప్ ఇప్పుడు కోలీవుడ్‌కి వెళ్లాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌ తీస్తున్నాడు.  'ప్రిన్స్‌' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా రైబాషప్కా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.

ధనుష్‌కి కోలవెర్రి సాంగ్‌తో వరల్డ్‌ వైడ్‌ గుర్తింపు వచ్చింది. 'రఘువరన్ బీటెక్, మారి' సినిమాలతో తెలుగులో కూడా స్టార్డమ్ వచ్చింది. ఈ మార్కెట్‌ లెక్కలతోనే ధనుష్‌తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్స్‌ తీస్తున్నారు నిర్మాతలు. ఆల్రెడీ శేఖర్ కమ్ముల ధనుష్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఇక వెంకీ అట్లూరి, ధనుష్‌తో  'సార్' అనే సినిమా తీస్తున్నాడు. తమిళ్లో ఈ మూవీ 'వాతి' పేరుతో రిలీజ్ కాబోతోంది.

వంశీ పైడిపల్లి 'మహర్షి' తర్వాత మళ్లీ మహేశ్ బాబుతోనే సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. అయితే కొంత గ్యాప్‌ తర్వాత కోలీవుడ్‌కి వెళ్ళాడు. విజయ్‌తో మల్టీలింగ్వల్ మూవీ అనౌన్స్ చేశాడు. ఇక విజయ్‌ చాన్నాళ్లుగా తెలుగులో స్టార్డమ్ సంపాదించాలని ట్రై చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో టాలీవుడ్‌లోనూ జెండాపాతాలని ప్రయత్నిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: