కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక నటుడుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు రజనీకాంత్. ఇక ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ అభిమానుల సైతం మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. మొదట బస్ కండక్టర్ నుంచి తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఎదిగారు. అయినప్పటికీ తన జీవితంలో కేవలం 10% మాత్రమే ఆనందం సంతోషం ఉందని తెలియజేశారు.

చెన్నైలో హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు రజనీకాంత్ హాజరుకాగా అప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. రజనీకాంత్ ఒక గొప్ప నటుడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది ప్రశంసలు విమర్శలు అని అర్థం కావడంలేదని .. అయితే తన కెరియర్లో రాఘవేంద్ర బాబా వంటి చిత్రాలు మాత్రమే తనకు ఆత్మసంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలకు వెళ్లారని.. ఆయన అభిమానులు సైతం కొంతమంది సన్యాసులుగా మారిపోయారని కానీ తను మాత్రం ఇప్పటికి నటుడుగా తన కెరీర్ను కొనసాగిస్తున్నారు అని తెలిపారు. హిమాలయాలలో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయి వాటిని తిన్నట్లు అయితే వారానికి సరిపడా శక్తి లభిస్తుందని తెలిపారు.


మానవునికి చాలా ముఖ్యమైనది ఆరోగ్యం అనారోగ్యానికి గురి అయితే మనకు కావలసిన వాళ్లు కూడా తట్టుకోలేక పోతారు.. తన జీవితంలో డబ్బు పేరు ప్రఖ్యాతలు అన్నిటిని చూశాను సంతోషం ప్రశాంతతకు మాత్రం కేవలం 10 శాతం మాత్రమే దక్కింది అని. అయితే అవి శాశ్వతంగా ఉండేవి కావని తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమాలు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా రజినీకా సక్సెస్ వరిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: