పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూవీ లలో నటిస్తూనే , రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మాత్రమే తన పూర్తి దృష్టి పెట్టనున్నట్లు , దానితో ఇప్పట్లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి కావడం కష్టమే అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ నెల నుండి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'  మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాట్లు ,  అలాగే షూటింగ్ మొత్తాన్ని చక చకా పూర్తి చేయాలి అని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఆగస్ట్ నెలలో ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించి , నవంబర్ మొదటి వారం కల్లా ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేయాలి అని ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: