
అయితే ప్రస్తుతం సంయుక్త సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా ఈ అమ్మడు చేతిలో 8 సినిమాలు ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా బాలయ్యతో అఖండ 2 సినిమాలో నటిస్తోంది. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో మహారాగ్ని అనే చిత్రం, తెలుగులో హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభు అనే చిత్రం, అలాగే నారి నారి నడుమ మురారి చిత్రంతో హీరో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది.
మలయాళంలో మోహన్ లాల్ తో ఒక సినిమా, తమిళంలో బెంజ్ అనే సినిమాలో నటిస్తోంది.మొత్తంగా చూసుకుంటే తెలుగులో ఐదు, తమిళంలో ఒకటి, హిందీలో ఒకటి ,మలయాళం లో ఒకటి ఇలా ఓవరాల్ గా ఎనిమిది చిత్రాలలో తన హవా కొనసాగించేలా ప్లాన్ చేసింది సంయుక్త. ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నప్పటికీ మరికొన్ని పూర్తి అయినవిగా కూడా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే వచ్చే ఏడాది కనీసం రెండు మూడు చిత్రాలతో అయినా ప్రేక్షకులను అలరించేలా చూస్తోంది సంయుక్త మీనన్. మరి ఈ సినిమాలన్నీ కూడా సక్సెస్ అయితే సంయుక్త రేంజ్ మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.