
ఈ వ్యాఖ్యలు నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి, ఎందుకంటే బాలయ్య గతంలో పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చంద్రబాబు సానుకూల విషయాలను హైలైట్ చేశారు. చరిత్రలో తొలిసారిగా 93 శాతం రిజర్వాయర్లు నీటితో నిండాయని, ఇది విజన్-2047లోని పది సూత్రాల్లో కీలకమైన పరిణామమని పేర్కొన్నారు. పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించిందని, ఈ పథకం ద్వారా రూ.65 వేల కోట్లు రాష్ట్రానికి రావచ్చని ఆయన వెల్లడించారు.
ఉద్యాన, ఆక్వా రంగాల్లో ఈ నిధులు సద్వినియోగం కాగలవని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతం ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించాలని, స్థానిక పండుగలను ప్రోత్సహించేందుకు నెలకు ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్యలు రాష్ట్రంలో పర్యాటకం, స్థానిక సంస్కృతిని పెంపొందించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు