
ముందుగా మరో హీరోతో గ్యాంగ్ లీడర్ చేయాలని అనుకున్నారట దర్శకుడు. ఇంతకీ గ్యాంగ్ లీడర్ సినిమా లో ఎవరితో చేయాలనుకున్నారో తెలుసా ఏకంగా చిరంజీవి తమ్ముడు నాగబాబు ను హీరోగా పెట్టి గ్యాంగ్ లీడర్ ని తీయాలి అనుకున్నారట దర్శక నిర్మాతలు. చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే పెద్ద తమ్ముడు నాగబాబు నటుడిగా నటుడుగా పరిచయమై నిలదొక్కుకున్నాడు. అయితే కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు నటన చూసిన పరచూరి బ్రదర్స్ నాగ బాబు హీరోగా అరె ఓ సాంబ అనే టైటిల్ తో ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట.
అయితే నాగబాబు కొత్త వాడు కావడంతో అతనితో సినిమా అనేసరికి నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రాలేదట. దీంతో అన్న చిరంజీవి అయితే బాగుంటుందని నాగబాబు పరుచూరి బ్రదర్స్ తో ఒక అభిప్రాయం చెప్పాడట. కాగా దర్శకుడు విజయబాపినీడు వెళ్లి చిరంజీవిని కలిసి కథ వినిపించగా ఇక టైటిల్ మార్చి గ్యాంగ్ లీడర్ అని పెడితే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో అలాగే చేశారట. ఇలా నాగబాబు చేయాల్సిన సినిమా వేరే టైటిల్ తో చిరంజీవి చేసి సూపర్ హిట్ కొట్టాడు అని చెప్పాలి. అయితే ఒకవేళ నాగబాబు చేసి ఉంటే మాత్రం ఈ సినిమా అంతగా హిట్ అయ్యేది కాదేమో అని ప్రేక్షకులు భావన.