ప్రముఖ జాతీయ మీడియా RX ఇండియా సినీ సెలెబ్రెటీ జాబితా ను తాజాగా మరొకసారి విడుదల చేసింది. బాలీవుడ్ తో పాటు తెలుగు ఇండియన్ స్టార్స్ లో కూడా ఎవరున్నారు అంటూ అనే సర్వేను నిర్వహించింది. తాజాగా ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ నెంబర్ వన్ గా నిలిచారు. జులై నెలలో తెలుగు లో మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను తాజాగా విడుదల చేయడం జరిగింది. అత్యధికంగా ప్రజాధరణ పొందిన హీరోలలో ఎన్టీఆర్ టాప్ లో నిలిచారు. ప్రస్తుతం టాప్ టెన్ వరకు ఉన్న టాలీవుడ్ హీరోల ప్లేస్లను మనం ఒకసారి చూద్దాం.


సీనియర్ హీరోలలో కేవలం చిరంజీవికి మాత్రమే ఈ జాబితాలలో మరొకసారి చోటు దొరికిందని చెప్పవచ్చు. నెంబర్ వన్ ప్లేసులో ఎన్టీఆర్, ఉండగా నెంబర్-2 ప్లేసులో ప్రభాస్, నెంబర్ 3 ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నారు, నాలుగవ స్థానంలో రామ్ చరణ్ ఐదవ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు ఇక ఆ తర్వాత స్థానంలో నాని, ఏడవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ 9వ స్థానంలో చిరంజీవి పదోవ స్థానంలో రవితేజ వంటి వారు నిలిచారు.RRR చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం పెద్దగా ఆశ్చర్యం లేదంటూ అభిప్రాయాన్ని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ లో సమంత నిలిచింది ఈ మధ్య తెలుగులో ఈమె ఎక్కువగా సినిమాలు చేయకున్నప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్ల స్థాయిలో స్టార్డం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వచ్చేయడాది పాన్ ఇండియా స్థాయిలో వరుసగా తన సినిమాలను విడుదల చేయబోతోంది. ఇక రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలువగా ఆ తర్వాత స్థానంలో పూజా హెగ్డే మరొక స్థానంలో సాయి పల్లవి నిలిచింది. అయితే ఇది ప్రతి నెల మారుతూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: