2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు సౌత్ నుండి విడుదలైన ఎన్నో సినిమాలు హిందీ నుండి మంచి కలెక్షన్లను అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం ఇప్పటివరకు హిందీ నుండి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం.
యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ హిందీ లో 434.7 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 274.31 కోట్ల నెట్ కలెక్షన్ హిందీ లో వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా హిందీ లో 19.30 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.


నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ హిందీ లో 16.30 నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా హిందీ లో 12.71 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ హిందీ లో 12 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ హిందీ లో 6.64 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. 777 చార్లే మూవీ హిందీ లో 6.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ మూవీ హిందీ లో 2.30 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అజిత్ హీరోగా తెరకెక్కిన వాలిమై సినిమా హిందీ లో 2.10 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: