ప్రముఖ కోలీవుడ్ దర్శక ధీరుడు, నటుడు , నిర్మాత అయిన భారతీయ రాజా అస్వస్థకు గురైనట్లు సమాచారం. కడుపునొప్పితో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతుంది. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు రోజుల వైద్యుల సంరక్షణలో ఉంచాలని వైద్యులు కోరినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని నెలలుగా వరుసగా సినిమాలలో నటిస్తున్న భారతీరాజా మధురై ఎయిర్పోర్ట్ లో  ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఇక ఆయనను గమనించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు అని,  కేవలం అజీర్తి కారణంగా స్పృహ తప్పి పడిపోయారు అని వైద్యులు నిర్ధారించారు. ఇక విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని కూడా వారు వెల్లడించడం జరిగింది.

ఇకపోతే తెలుగులో 16 ఏళ్ళ వయసు .. తమిళ్లో 16 వయత్తినిలే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన భారతి రాజా ఆ తర్వాత సీతాకోకచిలుక ,కొత్త జీవితాలు, జమదగ్ని , ఆరాధన వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక దర్శకుడిగా బ్రేక్ తీసుకున్న తర్వాత నటుడిగా కూడా తన సత్తా చాటారు. ఇక ఇటీవల ధనుష్, రాశిఖన్నా, నిత్యామీనన్ నటించిన తిరు చిత్రంలో ఈ దర్శకుడు కీలకపాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఆస్పత్రిలో చేరిన భారతి రాజా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానుల సైతం దేవుని ప్రార్థిస్తున్నారు. ఇకపోతే అజీర్తి కారణంగా స్పృహ తప్పి పడిపోయాడు కాబట్టి పెద్దగా చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక త్వరలోనే ఆయన క్షేమంగా వస్తారు అని కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ఇలాంటి దర్శకులు సినీ ఇండస్ట్రీకి తప్పకుండా కావాలి అని ప్రతి ఒక్కరి అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: