పుష్ప ది రూల్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియన్ రేంజ్లో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్‌ అయింది. హిట్ హిట్ అవ్వడమే కాదు.. బన్నీకి ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో బన్నీ పెద్ద పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా అయ్యాడు.త్రూ అవుట్ ఇండియా ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ఎప్పుడాని ఎదురుచేసేలా చేసింది పుష్ప సినిమా. ఖచ్చితంగా బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్ ల లాగానే పుష్ప సిరీస్ కూడా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ చాటింపు వేస్తున్నారు.ఇక అందరి వెయిటింగ్‌కు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేలా చేసింది సుకుమార్ అండ్ టీం. తాజాగా పుష్ప2 మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఇక షూటింగ్ షురూ అవ్వడమే ఆలస్యం… ఆగేది లే.. తగ్గేది లే అనే హింట్‌ను బన్నీ ఫ్యాన్స్ కు ఇచ్చేసింది. 


ఇక ఈ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ నుంచి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ. పుష్ప లో పాటలు ఈ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచం మొత్తం దేవీ పాటలు మారుమ్రోగాయి. ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా దేవీ అదిరిపోయే పాటలను సిద్ధం చేస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ కోసం మూడు పాటలను కంప్లీట్ చేశారట దేవీ. ఇదే విషయాన్నీ తెలిపారు దేవీ శ్రీ. ఇక కథ ఎలా ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నాం.. చాలా డిఫరెంట్ గా చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు. దేవీ శ్రీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: