కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో అని శ్రీ విష్ణుకు మంచి ఇమేజ్ వచ్చింది. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ చిత్రాలను కూడా చేస్తున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లూరి అనే చిత్రాన్ని చేస్తున్నాడు శ్రీ విష్ణు. అయితే ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.

 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాని వచ్చాడు. నాని దసరా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సినిమా కోసం నాని గుబురు గడ్డంతో రగ్డ్ లుక్‌ను ట్రై చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ఆరు నెలలు మీడియా ముందుకు రానేమోనని అనుకున్నాడట. కానీ ఈ సినిమా కోసం ఇలా రావాల్సి వచ్చిందంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక అల్లూరి చిత్రం గురించి చెబుతూనే శ్రీ విష్ణు నిజ స్వరూపాన్ని బయటపెట్టేశాడు నాని. అందరి ముందు స్టేజ్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

 
ముందుగా అల్లూరి ట్రైలర్ మీద నాని ప్రశంసలు కురిపించాడు. అల్లూరి ట్రైలర్ చాలా బావుంది. అలాగే శ్రీవిష్ణుకి కూడా కొత్తగా వుంది. విష్ణు కమర్షియల్ యాక్షన్ సినిమా చేయడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. చాలా ఎనర్జిటిక్ గా వుంది. ఈ మధ్య కాలంలో ఎనర్జిటిక్ ఫిలిమ్స్ ని ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అల్లూరి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు.

 
ఇక శ్రీ విష్ణు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. స్వతాహాగా నేచురల్ స్టార్ అయిన నాని ఇలా అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది వుంటారు. అలాంటి నటుల్లో ముందు వరుసలో వుండే హీరో శ్రీవిష్ణు అని అతడ్ని ఆకాశానికి ఎత్తేశాడు. అందుకే శ్రీవిష్ణు అంటే నాకు చాలా ఇష్టమని అలా అందరి ముందే నాని అన్నాడు.

 
శ్రీ విష్ణు వ్యక్తిగత జీవితం గురించి అందరి ముందు కొన్ని విషయాలు బయటపెట్టేశాడు. అంటే సుందరానికీ సినిమా టైంలో ఓ పార్టీ జరిగిందట. ఆ పార్టీకి వివేక్ ఆత్రేయ స్పెషల్‌గా శ్రీ విష్ణుని పిలిచాడట. ఆ పార్టీలో శ్రీ విష్ణు అందరినీ నవ్వించేశాడట. ఎంతో జోవియల్‌గా ఉన్నట్టు ఇప్పుడు ఇలా ఉంటున్నాడు కానీ ఆ రోజు మాత్రం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడంటూ పొగిడేశాడు నాని.

 
పర్సనల్ గా కలిసినప్పుడు శ్రీవిష్ణు విశ్వరూపం చూశాను. విష్ణులో ఆ ఎంటర్‌టైనర్ కోణం కూడా బయటికి రావాలని కోరుకుంటాను. అది మీ అందరికీ నచ్చుతుంది. బయట చాలా రిజర్వడ్ గా వుండి లోపల చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. మహేష్ బాబు గారి తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు. శ్రీవిష్ణు కూడా అంత పెద్ద స్టార్ అయిపోవాలి. ఇప్పటికే మంచి నటుడనే పేరు వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను అని మహేష్ బాబుతో శ్రీ విష్ణుని పోల్చాడు.

 
అయితే మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి సహనటులు, హీరోయిన్లు, దర్శకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. బాబు సెట్‌లో ఉంటే ఫన్ ఉండాల్సింది. ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి సెటైర్లు వేస్తాడో కూడా ఊహించలేమని, అలా వేసేస్తాడు సైలెంట్ అవుతాడు అంటూ మహేష్ సెటైర్ల గురించి అందరూ చెబుతుంటారన్న సంగతి తెలిసిందే.

 
నిర్మాతలకు నాని ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిందే. అల్లూరి ట్రైలర్ ఈవెంట్‌లో నాని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గురించి మాట్లాడాడు. బెక్కెం వేణుగోపాల్ గారితో నేను లోకల్ చేశాను. ఆయన ఒక సినిమాని నిర్మిస్తారని అనడం కంటే దత్తత తీసుకుంటారని అనడం సబబు. సినిమా చేస్తున్నంత కాలం ఆ యూనిటే ఆయన కుటుంబం. అంతచక్కగా అందరినీ చూసుకుంటారని చెబుతూ నిర్మాత మీదున్న ప్రేమను చెప్పేశాడు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: