ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప.బన్నీ నటించిన పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఇక పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.  అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది.ఈ సినిమా  మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కి సంబంధించిన సన్నాహకాలు జరుగుతున్నాయి.ఇకపోతే పుష్ప ఈ రేంజ్ హిట్ అవుతుందని బహుశా బన్నీ, సుకుమార్ కూడా ఊహించి ఉండరేమో.

 ఈ చిత్రం రిలీజ్ అయ్యాక క్రిటిక్స్ నుంచి ఆశించిన స్పందన రాలేదు.  నార్త్ లో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.అయితే  ముఖ్యంగా బన్నీ మ్యానరిజమ్స్ కి అంతా ఫిదా అయ్యారు. ఇక పుష్ప చిత్రం తీసుకువచ్చిన క్రేజ్ బన్నీకి కాసుల పంటగా మారింది. అయితే పుష్ప మొదటి భాగానికి అల్లు అర్జున్ 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు. కాగా ఇప్పుడు పుష్ప 2 కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా బన్నీ 90 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ కి దిమ్మతిరిగే ఆఫర్ ఇస్తూ కార్పొరేట్ సంస్థలు బన్నీని తమ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా నియమించుకుంటున్నారు.

ఇక  పుష్ప తర్వాతే బన్నీ దాదాపు ఐదు సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది.కాగా  ఒక్కో యాడ్ కి 9 కోట్ల పైనే బన్నీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. ఇక దీనితో కేవలం యాడ్స్ ద్వారానే బన్నీ ఖాతాలోకి రూ 50 కోట్లు చేరినట్లు వార్తలు వస్తున్నాయి.సౌత్ లో అల్లు అర్జున్ స్టార్ డమ్ ని తెలియజేస్తోంది. ఇక పుష్ప 2 రెమ్యునరేషన్, యాడ్స్ కి వస్తున్న ఆఫర్స్ కలుపుకుంటే బన్నీకి ఏకంగా దాదాపు 140 కోట్ల వరకు ముడుతోందట.ఇదిలావుంటే రానున్న రోజుల్లో బన్నీ ఇంకా మరిన్ని యాడ్స్ చేయబోతున్నాడు. ఇక పుష్ప 2 కనుక విజయం సాధిస్తే బన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ పుష్ప 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని అంటున్నారు. దాఅంతెందుకు దాపు 300 కోట్ల బడ్జెట్ లో పుష్ప 2 తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: