అల్లు అర్జున్, సుకుమార్ కాంభినెషన్ లో వచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వల్ సినిమాకు చిత్ర యూనిట్ ప్లాను చేసింది.సెట్స్‌పైకి వెళ్లకుండానే ఎన్నో విషయాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోతుంది పుష్ప 2. పైగా దీనిపై సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వస్తున్నాయి.అల్లు స్టూడియోలో షూటింగ్ చేసుకోబోయే మొదటి పుష్ప 2 అని రావడం. మరి ఇందులో నిజమెంత. పుష్ప సీక్వెల్‌తోనే అల్లు వారి సొంత స్టూడియో ఓపెన్ కానుందా. అసలు దీని లాంఛింగ్ ఎప్పుడు.. అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు పుష్ప 2 షూటింగ్ మొదలు పెడతారా అని అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.


ఇప్పటికే సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసారు. దసరా తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఆర్నెళ్లలోనే టాకీ పూర్తి చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. దీనికోసం పర్ఫెక్టుగా షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే అల్లు స్టూడియోస్‌లో పుష్ప 2 షూటింగ్ మొదలు కానుందని ప్రచారం జరుగుతుంది.ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, నిర్మాతలకు సొంత స్టూడియోలున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్‌లో అల్లూ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మించారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియో ఓపెనింగ్ జరగనుంది..


హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్‌లో అల్లూ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మించారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియో ఓపెనింగ్ జరగనుంది. అయితే అందులోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వస్తున్న ప్రచారం మాత్రం పూర్తిగా అబద్ధం. ఆ రోజు రామలింగయ్య జయంతి కారణంగా.. లాంఛ్ చేస్తున్నాం కానీ షూటింగ్స్ ఏం లేవని తేల్చేసారు అల్లూ స్టూడియోస్ అధినేతలు. ఫిల్మ్‌ మేకింగ్‌కు అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీతో 10 ఎకరాలకు పైగానే ఈ స్టూడియో ఉండబోతుందని తెలుస్తుంది...వచ్చే నెల 1 న స్టూడియో ఓపెన్ అవుతుంది..కానీ ఇప్పటిలో లేదని తేలింది..మరి ఎప్పుడూ సెట్స్ మీదకు వెళుతూందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: