ఇక నిన్నటి నుంచి ఎక్కువగా చిరంజీవి గరికపాటి నరసింహారావు కు సంబంధించి ఒక వీడియో చాలా వైరల్ గా మారుతున్నది. దసరా పండుగ రోజున చిరంజీవి నాంపల్లిలో నిర్వహించిన ఒక వేడుకకు హాజరయ్యారు. అయితే ఈవెంట్లో చాలామంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇక వారి కుటుంబ సభ్యులకు కూడా చిరంజీవితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇక చిరంజీవి కనిపించడంతో ఒకవైపు అభిమానులు, ప్రముఖులు సైతం ఫోటోలు దిగేందుకు చాలా ఆసక్తి చూపించారు. ఇక చిరంజీవి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కాదనకుండా ప్రతి ఒక్కరితో సెల్ఫీ దిగి వారి ఆనందానికి సహకరించారు. ఇక చిరంజీవి ఈ విధంగా ఫోటోలు స్టార్ట్ చేసినప్పుడు గరికపాటి కూడా తన ప్రవచనాలను మొదలుపెట్టారు.


అందరూ ఫోకస్ కూడా చిరంజీవి పైన పెట్టడంతో ఆ క్రమంలో గరికపాటి కాస్త అసహనంతో వెంటనే ఆ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానే తరహాలో అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. వెంటనే చిరంజీవి తన పక్కన కు వచ్చి కూర్చోవాలని కూడా ఆదేశించారు. అయితే చిరంజీవి ఆ తర్వాత వెంటనే అక్కడికి వచ్చి గరికపాటి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక చిరంజీవి కూడా మీ ప్రవచనాలు తరచూ వింటూ ఉంటాను దాదాపుగా మీ తరహా లోని నేను కూడా ఆలోచిస్తూ ఉంటానని తెలియజేసినట్లు సమాచారం.


అంతేకాకుండా మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని చిరంజీవి తెలియజేశారు. అందుకు గరికపాటి కూడా చాలా వినయంగా చిరంజీవితో మాట్లాడడం జరిగింది. దీంతో ఆ గొడవ కాస్త అక్కడితో ముగిసింది. ఇక ఆ విషయాన్ని మళ్లీ నాగబాబు అనవసరంగా మళ్ళీ ఈ విషయంపై స్పందించారు సోషల్ మీడియాలో ఈ వీడియో పైన మాట్లాడుతూ ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడడం పరిపాటే అని నాగబాబు గరికపాట ని ఉద్దేశించి పేరు తెలియజేయకుండా ఈ పదాలతోనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: