ఈమధ్య జరిగిన అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలలో చిరంజీవి తన మావగారు అల్లు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేసాడు. వాస్తవానికి రామలింగయ్య గురించి ఆయన కుమారుడు అల్లు అరవింద్ కంటే చిరంజీవికే ఎక్కువ విషయాలు తెలుసు. అల్లుకు చిన్నతనం నుండి నటన అంటే విపరీతమైన ఇష్టం ఉన్న కారణంగా అప్పట్లో నాటక సమాజాల చుట్టూ తిరుగుతూ తనకు నాటకంలో అవకాశాలు ఇవ్వమని అల్లు అడుగుతూ ఉండేవాడట.


అయితే అప్పట్లో అలనాటి నాటక సమాజాల మేనేజర్లు కొత్తవారికి అవకాశాలు ఇచ్చేడప్పుడు ఏదోఒక వస్తువు లంచంగా ఇమ్మని అడిగేవారట. అప్పట్లో అల్లు ఆర్ధిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అల్లు తనకు తెలిసిన బయ్యం దుకాణంలో అప్పుచేసి బయ్యం బస్తాలు తీసుకుని అనాటక సమాజం మేనేజర్ కు లంచంగా ఇచ్చి అవకాశాలు తెచ్చుకునే వాడట.


ఇలాంటి విషయాలను చిరంజీవి గుర్తుకు చేసుకుంటూ తన మామగారు అల్లు పట్టుదల ముందు తన పట్టుదల చాలచిన్నది అని చెప్పాడు. అంతేకాదు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు హోమియోపతీ వైద్యం నేర్చుకుని ఆరోజుల్లోనే చాలామందికి ఉచితంగా వైద్యం చేసిన కీర్తి ఆయన సొంతం అంటూ ఆయన లా తాను నటిస్తూ వేరే రంగంలో పెద్దగా రాణించలేకపోయాను అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు.


ఇప్పటికీ తన ఇంటిలో ఎవరికీ చిన్నచిన్న అనారోగ్యాలు వచ్చినా తన మామయ్యా ఇచ్చిన హెల్త్ కిట్ లోంచి మందులు వాడుతూ ఉంటామని తప్పకపోతేనే అలోపతి మందులు వేసుకుంటాము అంటూ మరొక ఆసక్తికర విషయాన్ని తెలియచేసాడు. రామకృష్ణ పరమహంస స్వామివివేకానంద ల గురించి అల్లు తనతో తరుచూ మాట్లాడుతూ ఉండేవారని తనకు అల్లు ఒక మామయ్యా లా కాకుండా ఒక స్నేహితుడులా ఎన్నో సలహాలు ఇచ్చిన విషయాలను చిరంజీవి గుర్తుకు చేసుకున్నాడు. అల్లు స్టూడియోస్ పేరుతో అల్లు ఫ్యామిలీ సభ్యులు ఏర్పాటు చేసిన సభలో చిరంజీవి చేసిన ఉపన్యాసం అనేకమందికి ఆశక్తిని కలిగించింది..




మరింత సమాచారం తెలుసుకోండి: