తెలుగు, తమిళ్ లో నయనతార పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడి బాస్ గా అందరికి ఆమె పేరు సుపరిచితమే..సినీ ఇండస్ట్రీలో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటూన్న హీరోయిన్ అని అందరికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలలో నటించింది..ఈమె తో ఎ సినిమా చేసిన కూడా భారీ హిట్ అవ్వడంతో అందరూ ఆమెతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కాగా, ఈమె తమిళ డైరెక్టర్ శివన్ తో ప్రేమలో ఉండింది.ఇటీవల వారిద్దరు కలిసి అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నారు..


ఈమె ప్రస్తుతం తల్లి కావాలని అనుకుంటుంది..అందుకే ఇందుకోసం ఆమె కొత్త ప్రాజెక్టులను అంగీకరించడం లేదు.అయితే.. తన భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ 'రౌడీ పిక్చర్స్‌' పతాకంపై చిత్రాలు నిర్మించేలా ప్లాన్‌ చేస్తున్నారు. నయనతార నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 'కనెక్ట్‌' షారూక్‌ ఖాన్‌ నటిస్తున్న హిందీ చిత్రం 'జవాన్‌' జయం రవి నటించే 'ఇరైవన్‌' ఉన్నాయి. ఇవన్నీ పెళ్ళికి ముందుకు ఒప్పందం చేసుకున్నవే. పెళ్ళి తర్వాత ఆమె ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా అంగీకరించడం లేదు. అంటే తల్లి కావాలన్న ఆశతోనే నయనతార ఈ నిర్ణయం తీసుకుని, కొత్త సినిమాల్లో నటించేందుకు సమ్మతించడం లేదనేలా కోలీవుడ్‌ వర్గాలలో వినిపిస్తోంది..


ఆమె తెలుగులో సత్యప్రియగా నటించిన 'గాడ్‌ఫాదర్'  చిత్రం విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి కి ఆమె చెల్లెలిగా నటించింది. నయనతార పాత్రకి కూడా సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా కాకుండా.. ఇంకా ఆమె అంగీకరించిన ఇతర సినిమాల షూటింగ్స్‌ని కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలని నయనతార భావిస్తోందట. అందుకారణం.. ఆమెకు అమ్మ కావాలనే ఆశే అని కోలీవుడ్ మీడియాలు రాస్తున్నాయి. నిజంగా ఆమె పెళ్లి తర్వాత నూతన ప్రాజెక్ట్స్‌ను అంగీకరించడం లేదు. సో.. కోలీవుడ్  మీడియా ఆమెపై రాస్తున్న వార్తలను చూస్తుంటే.. నయన్, విఘ్నేష్‌ల నుండి ఆ గుడ్ న్యూస్ త్వరలోనే వచ్చే అవకాశముంది..మరి ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: