చలాకి చంటి.. ఈ పేరు తెలియని బులితెర ప్రేక్షకులు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అటు జబర్దస్త్ ద్వారా మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రతి తెలుగుప్రేక్షకుడికి దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో ఉండే టాప్ టీం లీడర్లలో చంటి కూడా ఒక్కరు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒకవైపు జబర్దస్త్ లో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు అటు సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల చలాకి చంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.  బిగ్ బాస్ ఆరవ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే చలాకీ చంటితో పాటు ఫైమా కూడా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే గతంలో ఇలాగే జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్గా వచ్చిన ముక్కు అవినాష్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏకంగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నందుకు గాను 10 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మళ్లీ జబర్దస్త్ లో అడుగు పెట్టేందుకు వీలు కూడా లేకుండా పోయింది.


 ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్న చంటి బిగ్ బాస్ లోకి వచ్చాడు. కానీ ఎందుకో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇలాంటి సమయంలో కొత్త చర్చ మొదలైంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన చంటిని మల్లెమాల వాళ్లు మళ్లీ జబర్దస్త్ లోకి రానిస్తారా.. లేకపోతే అవినాష్ లాగానే చంటిని కూడా ట్రీట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే పలుమార్లు చంటి జబర్దస్త్ ను తప్పుకోవడం మళ్లీ రావడం జరిగింది. అయితే గతంలో జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఇతర షోలలో కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ లోకి వెళ్లి బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: