ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్‌ సక్సెస్‌ తో బాస్ ఈజ్‌ బ్యాక్ అనిపించాడు చిరు. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా ఆడియెన్స్‌ ను అలరిస్తూ మొత్తానికి హిట్‌ కొట్టేసి ఫ్యాన్సుకి పండగ సందడి పెంచాడు.ఎన్నో ఎక్స్‌ పెక్టేషన్స్‌, మరెన్నో కామెంట్స్‌ మధ్య గాడ్‌ ఫాదర్‌ ఈ బుధవారం విడుదలై బాక్సాఫీస్‌ బరిలో నిలిచినా దసరా పేరు మీద ఒకట్రెండు రోజులు, వీకెండ్, సండే పేరుతో మరో రెండు రోజులు బాగానే ఆడింది.

ఆ తర్వాత మండే నుంచి కలెక్షన్స్‌ డ్రాపవడ్డం స్టార్టయింది. అఫ్‌ కోర్స్.. ఇది దాదాపు ప్రతి సినిమాకు జరిగేదే. కానీ గాడ్ ఫాదర్‌ను ప్రెస్టేజియ్‌ గా తీసుకున్న మూవీ టీమ్‌ అండ్ మెగా వర్గం మాత్రం వసూళ్లను ఇంకాస్త రెయిజ్‌ చేసే పనిలోపడి ప్రమోషన్స్‌, సక్సెస్ పోస్టర్స్‌ తో సోషల్మీడియాలో ప్రచారాన్ని పెంచేశారు. వరల్డ్ వైడ్ గ్రాస్‌ వందకోట్లు దాటిందంటూ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు కూడా.

సరిగ్గా ఇక్కడే అనేక రకాల అనుమానాలు రేకెత్తడంతో పాటు డిఫరెంట్ కామెంట్స్‌ పాస్ అవుతున్నాయి. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం భారీ సక్సెస్ సాధించిన తర్వాత వసూళ్లని అనౌన్స్‌ చేయలేదు. తమ సినిమాలకు గానీ, తమ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చే చిత్రాలకు గానీ బాక్స్ ఆఫీస్‌ కలెక్షన్స్‌, గ్రాస్‌ నెంబర్స్‌ ని రివీల్ చేయననీ దాంతో ఫ్యాన్‌ వార్స్ తగ్గుతాయనీ ప్రకటించాడు చరణ్‌.

ఆ తర్వాత చిరు,

చరణ్‌ కలిసి నటించిన ఆచార్య ఫ్లాపవ్వడంతో కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేయాల్సిన అవసరం గానీ, తెలుసుకోవాలన్న ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్‌ లో గానీ లేకుండా పోయింది. అది వేరే విషయం. కానీ రీసెంట్ గా గాడ్ ఫాదర్‌ గ్రాస్ కలెక్షన్ వందకోట్లు దాటిందంటూ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేయడంతో డిఫరెంట్‌ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు సినిమాకి మరింత హైప్ పెంచి బిజినెస్ చేసుకునేందుకు నెంబర్లతో పోస్టర్లు రిలీజ్‌చేస్తున్నారా? లేక మూవీ హిట్టే అని తెలియజేసేందుకు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్‌ ఫాలో అవుతున్నారా? అయినా అప్పుడు చెప్పిన మాట మీద నిలబడేట్లయితే ఇప్పుడు ఫ్యాన్ వార్స్‌ గురించి ఎందుకు ఆలోచించడం లేదంటూ క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్‌.అన్ని సినిమాలకీ అందరిలాగే ప్రకటిస్తే ఇక్కడ ఎలాంటి ఇష్యూ రెయిజయ్యేది కాదు. కానీ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకి మాత్రం ఇలా గ్రాస్, నెట్, ఓవర్సీస్.. బాస్, మాస్ అంటూ ప్రమోషన్స్‌ చేసుకోవడంతోనే వచ్చింది సమస్యంతా. నిజానికి గాడ్ ఫాదర్ హిట్టే అయినా చిరుకున్న ఫాలోయింగ్ కీ, గ్రేస్‌ కీ, క్రేజ్‌ కీ ఇంకా హై కలెక్షన్స్‌ వచ్చుండాల్సిందనేది బాక్సాఫీస్‌ పండితుల విశ్లేషణ.

అంత పండగ టైమ్‌ లోనే, వరుస సెలవుల్లోనే వసూళ్లు ఈ స్థాయిలో ఉంటే ఇక ఈ వారం నుంచి బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్స్‌ అనేది కష్టమే. ఆ మ్యాటర్ రియలైజయ్యే ఇలాంటి ప్రమోషన్స్‌ ప్లాన్ చేశారా అంటూ మెగా ఫ్యాన్స్‌ లోనూ డిస్కషన్స్‌ మొదలైపోయాయి.

ఏదేమైనా.. ఓ బడా స్టార్ హీరో కొత్త సినిమా కలెక్షన్లను అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేస్తే అభిమానులు సందడి చేసుకోవాల్సింది పోయి అనుమానాలు పడే పరిస్థితి రావడమేంటో బాసూ!

మరింత సమాచారం తెలుసుకోండి: