మెగా 154: అభిమానులకు పండుగ నాడు గుడ్ న్యూస్?

యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా డబ్బింగ్ పనులు శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభించినట్లుగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ముందుగా ప్రకటించినట్లుగా 2023 సంక్రాంతికి సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేసి షెడ్యూల్ ప్రకారం పనులు జరుపుతున్నారని తెలుస్తోంది.అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెగా154 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా-మాస్ పూనకాలు లోడ్ అవుతున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ - కె.చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. హరి మోహన కృష్ణ ఇంకా అలాగే వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. దీనికి నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.మెగా154 సినిమాకి ''వాల్తేరు వీరయ్య'' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి మేకర్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.మరి చూడాలి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: