పూర్వ నటిగా అనేక సినిమాల లో నటించి ప్రేక్షకుల ను అలరించిన తులసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడ్డారు అని మనకు తెలిసిన విషయమే . ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె వరస సినిమాలతో  చాలా బిజీ గా మారిపోయారు.

తెలుగు సినిమాల నుండి మంచి ఆఫర్లు రావడం కారణంగా ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ కు కూడా షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అనేక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రస్తావించారు ఇలా .


అయితే తులసి అమ్మగారికి మహానటి సావిత్రి గారి తో అలాగే అంజలీదేవి గారి తో మంచి స్నేహానుబంధం ఉండేదట ఆమెకి . అలా తరచూ తులసి వారి ఇంటికి కూడా వెళ్లేవారట. అలా తులసీని చూసిన సావిత్రి గారు బాల నటిగా పరిచయం చేయమని వారి అమ్మగారిని ఒత్తిడి చేయడం కారణంగా వారి అమ్మ గారు కూడా తులసిని నటన వైపుకు నడిపించడానికి ఉత్సాహాన్ని చూపించారు అంటా మరి.

అయితే తులసి చిన్నప్పుడే వారి నాన్నగారు చనిపోయారట. వారి అమ్మగారి మంచి తనం కారణంగా రెంట్ కూడా కట్టకుండా వారి ఇంట్లో కొంత మంది సినిమా వాళ్లు అద్దెకు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఏ వంట చేసిన ఆ వీధిలో ఉన్న వారందరి కీ పంచేసేవారట. ఇరుగు పరుగు వారెవరైనా సరే అది బాగుంది అంటే అది ఎంత ఖరీదైన సరే వెంటనే అది వాళ్ళకి ఇచ్చేసేవారట. అమ్మ అతి మంచి తనం కారణం వల్లే తమ ఆస్తి అంతా కూడా కరిగిపోయిందంటూ తులసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ కారణంగానే ఫ్యాషన్ తో నటన వైపు వెళ్ళిన తనకు.. ఆ తరువాత నటనే అవసరమైపోయిందంటూ తులసి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు ఇలా, ప్రస్తుతం తులసి కార్తికేయు 3 కు, డేట్స్ ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: