తాజాగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉందట.. ఈ చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


ఇక ఈ రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జెఆర్ సి కన్వెన్షన్ హాల్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హరిశంకర్ గెస్ట్ గా రావడం జరిగిందట.. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ నటుడు శివ కార్తికేయన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. వాటి గురించి చూద్దాం.


 


విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది.. ప్రిన్స్ మూవీ ప్రమోషన్లలో నేను కూడా భాగమైనందుకు సురేష్ ప్రొడక్షన్ ,ఏసియన్ ఈ రెండు బ్యానర్లు తన కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేశాయి.. సురేష్ ప్రొడక్షన్ వల్ల పెళ్లి చూపులు సినిమా మీ అందరి దగ్గరకు వచ్చింది. ఇక సునీల్ నారంగ్ గారు అర్జున్ రెడ్డి అనే సినిమాను మీ అందరి దగ్గరకు తీసుకువచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్న సమయంలో నాగ్ అశ్విన్, అనుదీప్ షార్ట్ ఫిలిం చూపించి నవ్వుకునేవారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ జాతి రత్నాలు అనే బ్లాక్ బాస్టర్ సినిమాని కూడా తీశారు.


 

ఇప్పుడు అనుదిప్ ప్రిన్స్ అనే ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నారు. ట్రైలర్ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. అనుదీప్ అందరిని నవ్వించే దర్శకుడు అక్టోబర్ 21న ప్రిన్స్ తో మరో హిట్టు కొడతాడని నేను భావిస్తున్నానని తెలిపారు. నటుడు శివ కార్తికేయన్ సార్ ని నేను ఎప్పుడు కూడా కలవలేదు. కానీ నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నా పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తు ఆయన రేమో సినిమా కూడా రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే కనిపించాయి. అలాగే శివ కార్తికేయన్ గారి జర్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన ఈవెంట్లో స్టేజి పైన ఏడుస్తుంటే మనలో ఒకరు ఏడుస్తున్నారు అని ఓ బ్రదర్ ఫీలింగ్ కలిగింది.మాకు సినిమా అంటే ప్రాణం ఎంతో మనసు పెట్టి చేస్తుంటాం. ఆయన కోసం ఏదైనా చేయాలి అని ఆ టైంలో అనిపించింది. అలా ప్రిన్స్ తెలుగు రాష్ట్రాలలో ప్రమోట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారట విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: