ఆర్‌ఎక్స్‌ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఆ తర్వాత నటిగా తాను కోరుకున్న స్థాయిని అందు కోలేకపో యింది పాయల్ రాజ్‌పుత్. ఓ మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆమె రీసెంట్‌గా మంచు విష్ణుతో కలిసి 'జిన్నా' మూవీ చేసింది.రేపు మూవీ విడు దలవుతు న్న సంద ర్భంగా మాట్లా డుతూ

'ఆర్‌ఎక్స్ మూవీ నాకు మంచి పేరు తెచ్చిం ది. అయితే ఆ సినిమా తరు వాత నా మేనేజర్‌తో పాటు కొం తమంది రాంగ్ గైడెన్స్ ఇవ్వ డంతో స్క్రిప్ట్ కూడా వినకుం డానే సినిమాలు చేసేశాను. కథ విని, ఆచి తూచి సెలెక్ట్ చేసు కుంటేనే పేరు వస్తుం దని తెలు సుకుని ఇప్పుడు జాగ్రత్త పడుతు న్నాను. 'అన గనగా ఓ అతిథి' మూవీ చూసి మోహన్‌ బాబు సర్ నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. తర్వాత రెండు నెలలకి 'జిన్నా'లో చాన్స్ ఇచ్చారు. స్వాతి అనే విలేజ్ గాళ్ పాత్ర. పచ్చళ్లు అమ్ముతుంటాను.నా రోల్‌తో పాటు మూవీ కూడా ఎంటర్ ‌టైనింగ్‌గా ఉంటుంది. విష్ణు, సన్నీ లియో న్‌లతో కలిసి నటించడం హ్యాపీ. ఈ సినిమాతో జర్నీ ఓ ట్రైనిం గ్‌లా ఉపయోగపడింది. చాలా నేర్చు కున్నాను. టికెట్స్‌కి పెట్టే ఖర్చుతో సబ్‌ స్క్రిప్షన్ తీసుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడొచ్చని ఓటీటీలకి వెళ్తున్నారు ఆడియెన్స్. అద్భుతమైన కంటెంట్ ఉంటేనే థియేటర్‌కొచ్చి చూస్తు న్నారు. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమానే. దీని తర్వాత నావి మూడు సినిమాలు రాను న్నాయి. కన్నడ మూవీ 'హెడ్‌బుష్‌' ఒక డాన్ బయో పిక్. అలాగే 'మీటూ మాయా పేటిక' మూవీలో ఐదు స్టోరీస్ ఉంటాయి. నాది చాలా ఇంట రెస్టిం గ్ రోల్. ఇక 'గోల్‌మాల్' అనే తమి ళ సినిమాలో జీవాతో యాక్ట్ చేస్తు న్నాను. హిందీ మూవీ 'దే ధనాధన్‌'కిఇది రీమేక్. ఇంకొక సినిమా డిస్క షన్‌ దశలో ఉంది' అని చెప్పింది పాయల్.

మరింత సమాచారం తెలుసుకోండి: