జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన నందమూరి వారసుడిగా పేరు ఉన్నప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా ఎదిగాడు.


ఇక ఆ తర్వాత ఈయన ఫాలోయింగ్ చూసి కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి తీశారు. ఇక అప్పటి నుండి నందమూరి వారసుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ఎన్టీఆర్ అమ్మాయిలకు చాలా దూరంగా ఉండి మాట్లాడతారు. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడట..


ఎందుకంటే ఇద్దరి మధ్యలో క్లోజ్ నెస్ ఉంటే వారి గురించి మీడియా ఏవో వార్తలు రాస్తోందని, అలా జరిగితే తనకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఆడవాళ్లకు ఇబ్బంది వస్తుంది అని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అంతేకాదు ఒక హీరోయిన్ తో రెండు మూడు సార్లు కూడా నటించారు. కానీ ఇంత మంది హీరోయిన్లతో నటించినప్పటికి ఏ హీరోయిన్ కి చెప్పని ఓ మాట కేవలం నిత్యామీనన్ కి మాత్రమే చెప్పారట. అయితే ఆ మాట చెప్పేటప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఆశ్చర్యపోయారట. అయితే తన భార్య షాకయ్యేంత మాట ఎన్టీఆర్ ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎన్టీఆర్ కి చాలా సిగ్గు ఎవరిని పొగడడు. ఎందుకంటే అమ్మాయిలను ఎలా అట్రాక్ట్ చేయాలో కూడా ఆయనకి తెలియదు.


కానీ నిత్యా మీనన్ నటనకు ఫిదా అయిన ఎన్టీఆర్ ఆమెను ప్రశంసించకుండా ఉండలేదట. ఇక ఆమె నటనకు ఓ రేంజ్ లో మార్కులు కూడా వేశారట. ఇక వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో మరో హీరోయిన్ సమంత కూడా నటించింది. అయితే జనతా గ్యారేజ్ సినిమాలో నిత్యామీనన్ క్యారెక్టర్ తక్కువే అయినా కూడా జనాలకు చాలా కనెక్ట్ అయింది. మరీ ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ నిత్యమీనన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ నిత్యమీనన్ గురించి మాట్లాడుతూ.. అసలు నేను నిత్య మీనన్ తో కలిసి నటిస్తానని అనుకోలేదు.. అంతేకాదు ఇప్పటి వరకు అలాంటి నటిని నేను చూడలేదు. నాకు ఆమె నటన చూస్తుంటే మరో సావిత్రి గారి లా అనిపించింది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారట.. ఇక ఈ మాట విన్నాక లక్ష్మీప్రణతి ఇంతమంది హీరోయిన్లలో ఎవర్ని పొగడని తన భర్త నిత్యమీనన్ ని పొగిడే సరికి ఒక్కసారిగా షాక్ అయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: