విశాఖ గర్జనలో జనసేనదినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రుల పై తప్పుడు మాటలు మాట్లాడటంతో నాగార్జున పవన్ పై సీరియస్ అయ్యాడు. కాగ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరోలలో ఒకరు కార్తీ..యుగానికి ఒక్కడు, ఆవారా, ఊపిరి, నా పేరు శివ మరియు ఖైదీ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు లో తన అన్నయ్య సూర్య రేంజ్ మార్కెట్ ని సంపాదించుకున్నాడు.. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'సర్దార్'.. అభిమన్యుడు వంటి సూపర్ హిట్ సినిమాని తీసిన మిత్రన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.అక్కినేని నాగార్జున తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఘనంగా విడుదల చేస్తున్నాడు..ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ 'కార్తీ నాకు తమ్ముడు లాంటి వాడు.. ఊపిరి సినిమా చేస్తున్న సమయం లో మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా గొప్పగా ఏర్పడింది.. ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వాళ్ళ షాడో నుండి బయటపడి సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న హీరోలు నాకు తెలిసి ముగ్గురే..ఒకరు చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్.. మరొకరు శివరాజ్ కుమార్ గారి తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మరియు తమిళనాడు లో సూర్య తమ్ముడు కార్తీ.. వీళ్ళ ముగ్గురే అన్నయ్య సూపర్ స్టార్ షాడో నుండి బయటకి వచ్చి సొంత గుర్తింపు ని తెచ్చుకున్న హీరోలు.. కార్తీ సినిమాలు నేను బాగా చూస్తుంటాను..

మొదటి సినిమా నుండి ప్రతి సినిమా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది.. ఈ సర్దార్ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను.. ట్రైలర్ చూసాను.. అదిరిపోయింది..

సినిమా డైరెక్టర్ మిత్రన్ గత చిత్రం అభిమన్యుడు కూడా చూసాను.. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా.. కార్తీ అంటేతెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం.. ఈరోజు ఇక్కడకి వచ్చిన కార్తీని ఇంత ప్రేమతో అందరూ రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ను స్వతహాగా ఎదిగిన హీరోగా నాగార్జున మాట్లాడడం.. ఏపీలో వైసీపీ మంత్రుల విమర్శల నేపథ్యంలో వైసీపీకి సపోర్టు చేసే నాగార్జున ఈ మాటలు అనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కు మద్దతుగానే కార్తిని ఇన్ వాల్వ్ చేసి నాగార్జున వైసీపీకి చురకలు అంటించినట్టుగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: