
నెక్ట్స్ చేయ బోయే సినిమా లకు సం బంధించి ఇప్పటి వరకు ఎలాం టి అప్‌డేట్ లేదు. దీంతో రజనీ మరింత జాగ్రత్తలు తీసుకుం టున్నారనే వాదన విపినించింది. అయితే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో రజనీ కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు జోరు పెంచారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ల విషయంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఆయన ఒకే సారి రెండు సినిమా లకు సైన్ చేయడం విశేషం. అంతే కాదు ఒకే బ్యా నర్‌లో రెండు సినిమాలు చేయడం మరో విశేషమైతే, ఆ రెండూ ఒకేసారి ప్రారంభం కాబోతుండటం ఇంకో విశేషం.
ప్రస్తుతం `బీస్ట్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శక త్వం లో `జైలర్` చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా తనతో `2.0` చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో రెండు సినిమాలకు సైన్ చేశారు రజనీ కాంత్. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్ హెడ్ తమిల్ కుమార న్ వెల్లడించారు. ఈ రెండు చిత్రాలకు సంబంధిం చిన ముహూ ర్తపు కార్యక్ర మాలు నవంబర్ 5న చెన్నైలో జరగనున్నాయని వెల్లడించారు.
ఈ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ పతాకం పై ఛైర్మెన్ సుభా స్కరన్, డిప్యూ టీ చైర్మెన్ ప్రేమ్ శివస్వామి సమ ర్పణలో నిర్మితం కానున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకులె వరనేది మాత్రం వెల్లడించ లేదు. ఇతర ఆర్టి స్టులు, టెక్నీషి యన్ల వివరాల ను కూడా ఆ వివ రాలను త్వరలో నే తెలియజేస్తామని తెలి పింది నిర్మాణ సంస్థ. అయితే రజనీ సైలెంట్‌గా ఓకే సారి రెండు చిత్రాలకు సైన్ చేయడంతోఅభిమానులు ఖుషీ అవుతున్నారు