
వక్కంతం వంశీ కథ తాను రవితేజతో చేయాల్సిన సినిమా అని, ఆ కథ రవితేజకి చెప్తే మొదట ఓకే చేశారు గానీ తర్వాత స్క్రిప్ట్ నచ్చలేదని నిరాకరించినట్టు మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. షాడో తర్వాత ఆ సినిమా తీయాల్సింది, కానీ ఆగిపోయింది. జరగలేదని, పవర్ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించానని అన్నారు. కానీ కథ రవితేజకి నచ్చక సినిమా పట్టాలెక్కలేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ కథని ఎన్టీఆర్ కి వినిపించారు వక్కంతం వంశీ. పూరీ టేకింగ్ అయితే బాగుంటుందని పూరీతో సెట్ చేశారు. అది కాస్తా టెంపర్ అయ్యింది. ఒకవేళ నిజంగా టెంపర్ సినిమా రవితేజ చేసి ఉంటే.. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చి ఉంటే వేరేలా ఉండేదేమో. ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు కానీ రవితేజ, మెహర్ రమేష్ ల ఖాతాల్లో ఒక బ్లాక్ బస్టర్ పడేది. కానీ బ్యాడ్ లక్.. ఒక మంచి అవకాశం చేజారిపోయింది.