అప్పట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాంబినేషన్ అంటే అది కేవలం ఎన్టీఆర్ మరియు సావిత్రి మాత్రమే. వీరికి మాత్రమే అభిమానులు విపరీతంగా కనెక్ట్ అయ్యవారు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఎన్నో ఏళ్ళ పాటు అనేక సినిమాల్లో నటించిన ఈ జంట పై అప్పట్లో ఎదో ఉందంటూ చాల రూమర్స్ కూడా వచ్చేవి. ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ లో హీరో హీరోయిన్ గా వచ్చిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. అంతకు ముందు పాతాళ భైరవి సినిమాలో ఒక సీన్ లో మాత్రమే కలిసి నటించిన ఫుల్ లెన్త్ హీరోయిన్ గా మాత్రం మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఈ చిత్రం 1950 లో విడుదల అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ సినిమా ఈ జంటకు చాల మంచి పేరు తీసుకచ్చింది.

మిస్సమ్మ సినిమా 1955 లో విడుదల అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు ఈ జంట ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే ఒకసారి ఎన్టీఆర్ తో నటించను అంటూ చెప్పి ఒక సినిమా నుంచి కావాలనే తప్పించుకుందట. ఆ వివరాల్లోకి వెళ్తే, 1965 ఎన్టీఆర్ హీరోగా సత్య హరిశ్చంద్ర సినిమా తీయాలని విజయ సంస్థ నిర్ణయించుకుందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎప్పటి లాగానే సావిత్రి కి ఇవ్వాలని అనుకున్నారట. ఆమెకి కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకుందటషూటింగ్ మొదలవ్వడానికి కొన్ని రోజులకు ముందు సావిత్రి దగ్గరికి విజయ సంస్థ లో పని చేసే ఒక వ్యక్తి వెళ్ళాడట... ఆ సమయంలో సత్య హరిశ్చంద్ర సినిమా గురించి ప్రస్తావన రాగానే చంద్రమతి పాత్ర ఎందుకు ఒప్పుకున్నావ్ అని నేరుగా అడిగేశాడట. అప్పటికే సదరు వ్యక్తికి సంస్థకి ఏవో కొన్ని ఇగో సమస్యలు ఉండటం తో సావిత్రిని ఆ సినిమా నుంచి తప్పించాలని అనుకున్న ఆ వ్యక్తి సావిత్రి మైండ్ ని మార్చేసాడట. విజయ సంస్థ అంతకు ముందు తీసిన జగదేకవీరుడు సినిమాలో నీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. అది రొమాంటిక్ పాత్ర అని అందుకు నువ్వు పనికి రావని వాళ్ళు అనుకున్నారని చెప్పాడట. అంతే కాదు పెద్ద వయసు తల్లి పాత్రను నీచేత చేయించి నువ్వు హీరోయిన్ గా పనికి రావు అని ముద్ర వేస్తారా అంటూ ఆమెకు లేనిపోనివి అన్ని చెప్పేశాడట. ఇవన్నీ నమ్మిన సావిత్రి ఆ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించను అంటూ నోటికి వచ్చిన అబద్దం చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: