అతిలోక సుందరిగా.. ఆరాధ్య దేవతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే... ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే  నేడు మన మధ్య ఆమె లేకపోయినప్పటికీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే అభిమానులు కోకొల్లలు.ఇదిలావుంటే ఇక అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు.అయితే  బాల నటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో వందల సినిమాలలో నటించి మెప్పించింది. 

కాగా 1963 ఆగస్టు 13వ తేదీన తమిళనాడులో జన్మించిన శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి.ఇకపోతే భూలోక సౌందర్యం శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక  మూడు తరాల హీరోల సరసన హీరోయిన్గా అలరించిన అందం శ్రీదేవి సొంతం. అంతేకాదు ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏకచిత్రాధిపత్యంగా ఏలిన శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో సహా అందరూ స్టార్ హీరోలతో నటించింది.ఇక  తమిళ చిత్రాల్లో తన కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి ఆ తర్వాత సౌత్ ఇండియా తో పాటు అనేక భారతీయ భాషల్లో నటించి మెప్పించింది.అయితే  వైవాహిక జీవిత విషయానికి వస్తే..

బోనీకపూర్ ను వివాహం చేసుకుంది.ఇదిలావుంటే ఇక  ప్రస్తుతం వీరి పిల్లలు జాన్వి కపూర్, ఖుషి కపూర్లు ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇకపోతే గతంలో శ్రీదేవి కమలహాసన్ ను వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇక వీరి కాంబినేషన్లో ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఓ రాధా ఇద్దరు కృష్ణులు వంటి సినిమాలు వచ్చి మంచి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అయితే  శ్రీదేవి కూడా తమిళ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే.అంతేకాదు  పైగా ఇద్దరు కూడా స్టార్ స్టేటస్ ను అనుభవించేవారు.ఇక  ఈ కారణాలతోనే ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి కమలహాసన్ ను అడిగారట. ఈ పెళ్లి ప్రపోజల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించాడు.అయితే  అందుకు ప్రధాన కారణం శ్రీదేవిని కమలహాసన్ చెల్లెలిగా భావించే వారట .ఇక  సినిమాలో వారి మధ్య లవ్ సీన్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం శ్రీదేవిని ఆ భావంతో చూడలేదని ఆయన చెప్పారట. ఇక అలా వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: