
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రేమి అమరం, రాహుల్ ఆనంద్, రాజ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే శివ కార్తికేయ ఒక స్కూల్లో టీచర్‌గా ఉంటారు. అదే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా మరియా రేపోషప్క ఉంటుంది. ఆమె ప్రేమలో శివ కార్తికేయన్ పడడం జరుగుతుంది. అయితే హీరో ఇండియన్ అబ్బాయి హీరోయిన్ బ్రిటిష్ అమ్మాయి కావడంతో ఈ ప్రేమకు అడ్డంకులు వస్తాయట. దీంతో ఈ ప్రేమ పోరాటం కాస్త రెండు దేశాల మధ్య ఒక పోటీగా మారుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ప్రేమని ఎలా గెలుచుకున్నారు అనే విషయం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడక తప్పదు.
ఇక ఇందులో కూడా విభిన్నమైన కామెడీ పంచలతో ఎంతో అహ్లాదకరంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పవచ్చు మరి థియేటర్లో మెప్పించిన ఈ సినిమా ఓటీటి లో ఎంత మటుకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. అందుకు సంబంధించి ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది.