సినిమా ఇండస్ట్రీ కి మూలస్తంబాలలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నిన్న గుండెపోటు వచ్చి మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..ఇక సినీ ప్రముఖులందరూ కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి కనీతి వీడ్కోలు పలికారు..కానీ ఇక  అక్కినేని నాగార్జున గారు మాత్రం కృష్ణ గారిని చివరి చూపు చూసేందుకు రాలేదు..అయితే ఇది ప్రస్తుతం ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి..ఇక అక్కినేని అభిమానులు సైతం నాగార్జున ఇలా చెయ్యడం పై సోషల్ మీడియా లో తప్పుబడుతున్నారు..

అంతేకాదు ముఖ్యమంత్రులే పనులు మానుకొని మరీ కృష్ణ గారి భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులు అర్పిస్తుంటే నీకు హాజరవ్వడానికి ఏమి నొప్పి?అంటూ అభిమానులు సోషల్ మీడియాలో లో నాగార్జున ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.ఇక నాగార్జున ప్రస్తుతం గోవా లో ఉన్నందునే రాలేకపోయారని తెలుస్తుంది..అయితే వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలను నిర్మిస్తున్న వారే నేడు షూటింగ్స్ ని బంద్ చేసి స్వచ్చందం గా కృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నారు..ఇక అలాంటిది నాగార్జున గారికి కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు అయ్యినప్పటికీ కూడా చివరి చూపు చూసేందుకు రాకపోవడం పై అందరూ తప్పుపడుతున్నారు.

ఇదిలావుంటే ఇక ఈ సినిమా లో ఒక సన్నివేశం లో నాగార్జున కృష్ణ గారి చొక్కా కాలర్ పట్టుకున్నందుకు అప్పట్లో కృష్ణ గారి అభిమానులు నాగార్జున పై తీవ్రంగా విరుచుకుపడ్డారు..అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున దిష్టి బొమ్మలను తగలపెట్టారు.ఇక అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారం రేపింది..స్వయంగా నాగార్జున రంగం లోకి దిగి అభిమానులకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..అయితే అప్పటి నుండి కృష్ణ గారికి నాగార్జున గారికి పెద్ద మాటలు లేవు..ఇక అది మనసులో పెట్టుకొని నాగార్జున గారు కృష్ణ గారి చివరి చూపు చూడడానికి ఇష్టపడేలేదని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: