తను హీరోగా నటించిన ఆది పురుష్ చిత్రం అవుట్ పుట్ విషయంలో సంతృప్తిగా లేని కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశాడు హీరో ప్రభాస్. టీజర్ చూసిన తర్వాత చాలా మంది పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిరిగి ఎడిట్ చేయాలని దర్శక నిర్మాతలకు సూచించాడు. దాంతో వారు ఆ పనిలో ఉండగా ప్రభాస్ ఈ సినిమాను జూన్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఔట్ విషయంలో సంతృప్తిగా లేని కారణంగా ప్రభాస్సినిమా విడుదల అపేయగా ఇప్పుడు ఆయన్ని సంతృప్తి పరచాలంటే సినిమా లుక్ ను పూర్తిగా మార్చేవేయాలని దర్శకుడు ఓం భావిస్తున్నాడట.

అందుకే ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించిన పాత్రల తీరును లుక్స్ ను మార్చి వేస్తున్నాడట. లూక్స్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుంటూ క్వాలిటీ ఉండేలా చూసుకుంటున్నాడట. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదని తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రజలకు ముందుకు తీసుకువచ్చి మెప్పించి తీరుతమని వారు చెబుతున్నారట. దాని కోసం మరో 100 కోట్లు అదనం గా అయినా పర్వాలేదు అని నిర్మాతలు ఈ సినిమాలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ముందుకు వెళుతున్నారు.

 రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో ఇలాంటి సినిమాలు ప్రజల వద్దకు తీసుకు వచ్చినప్పుడు వారు ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండాలి అంటే అన్ని విషయాలలో వారిని మెప్పించేలా సినిమాను చేయాలి అని వారు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా ను వారు ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నారు. మరి ప్రభాస్ కోరుకునే విధంగా వారి సినిమా ను రెడీ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ పాత్ర లో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించడం బాలీవుడ్ లో ఈ సినిమా కి ఎంతటి స్థాయి లో క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: