టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో దశాబ్ద కాలం గా ప్రేక్షకు లను తన సినిమాల ద్వారా అలరిస్తూనే ఉంది హీరోయిన్ తమన్నా. హ్యాపీడేస్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల అందరితో కలిసి నటించి ప్రేక్ష కులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె మునుపటి కం టే ఎక్కువ బిజీగా ఉందని చెప్పవచ్చు

ఇటు బాలీవుడ్ సినిమాలలో కూడా సినిమాలను అవకాశా లను అందుకుంటూ ముందుకు వెళుతుంది. టాలీవుడ్ విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వర లోనే ఈ సినిమా యొక్క విడుదల జరగబోతుంది. ఈ చిత్రం తర్వాత సినిమాల్లో ఏవైనా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో కూడా ఆమె ఒక టి రెండు సినిమాలను చేస్తుంది అని తెలుస్తుంది.

వయసు పెరిగిన వన్నె తరగని అందంతో ప్రేక్షకులను అల రిస్తున్న ఈమె ఇప్పుడు మునుపటి కంటే బిజీగా ఉండడం విశేషం. అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లి గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై కి చెం దిన ఒక బిజినెస్ మెన్ తో ఈమె పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు రావడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఆమె వయసు వారు చాలామంది పెళ్లిళ్లు చేసుకుని జీవితాలలో సెటిల్ అయి పోగా ఈమె ఇంకా సినిమాలను చేస్తూ ఉండటం పట్ల వారి అభిమానులను నిరాశ పరుస్తుంది. పెళ్లి చేసుకోవడం వారికి సంతోషకరమైన వార్త అని చెబుతున్న నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకుంటే సినిమాలను చేస్తుందో లేదో అన్న అనుమానాలను వారు వ్యక్తపరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: