
ఇక ఈ సినిమాలో త్రికర్తల చక్రవర్తి బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ ఎంతో అద్భుతంగా నటించారు. ఇందులో హీరోయిన్ గా కేథరిన్ నటించింది. బింబిసారా అంటే అద్భుతమైన విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ మరొకసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆతి త్వరలో ఆమిగొస్ అనే చిత్రంతో రావడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాను అని తెలియజేస్తున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ లైనప్పులో డెవిల్ అనే పాన్ ఇండియా చిత్రం కూడా కలదు. ఈ సినిమా 1945 బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెంట్ నేపథ్యంలో జరిగినటువంటి ఒక కథ అంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.
అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టులు నటిస్తున్నారు. ఇక వీటితోపాటు డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో బింబిసారా -2 చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. కేవలం బింబిసారా ఇచ్చిన సక్సెస్ తో కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. సీరియస్ లుక్కులు చేస్తూ కనిపిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇదంతా కేవలం తన తదుపరి చిత్రాల కోసమే అన్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు.