తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఈ సంవత్సరం ఇప్పటికే మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. అందులో థాంక్యూ సినిమాలో నాగ చైతన్య సోలో హీరోగా నటించగా బంగార్రాజు మూవీ లో నాగార్జున తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తేరకేక్కిన లాల్ సింగ్ చడ్డ మూవీ లో నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఎన్ సి 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. 

మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఇళయ రాజా  , యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా యొక్క ఫ్రీ లుక్ ను రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ ఎనిట అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో అరవింద స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: